Saturday, 11 April 2026 04:23:46 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్


Date : 27 June 2025 11:40 PM Views : 713

గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, దేశంలో ఆయనతో పోల్చదగిన ప్రజాహిత నాయకుడు మరొకరు లేరని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ కొనియాడారు. విజయవాడలో జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, చంద్రబాబు నాయకత్వ పటిమపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు ప్రజల కోసం దేవుడు పంపిన వరంగా చంద్రబాబును అభివర్ణించారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులకు వేదికగా నిలిచింది.

అనంతరం కార్వాన్‌లను వారు పర్యాటక రంగంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ టూరిజం కాన్‌క్లేవ్ జరుగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాన్‌క్లేవ్ వేదికగా.. సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.10, 039 కోట్ల విలువైన పెట్టుబడులపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే పర్యాటకుల కోసం విశాఖపట్నం, రాజధాని అమరావతి, ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో రాష్ట్ర పర్యాటక రంగంపై వీడియోను ప్రదర్శించారు.

M Espitha Chowdary

Admin

మరిన్ని వార్తలు

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.