Saturday, 11 April 2026 04:23:25 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు

నాలుగు రోజుల పాటు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు... గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు..


Date : 26 June 2025 08:33 PM Views : 647

గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో నిన్నటి నుంచి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండుచోట్ల 50-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్‌డీఎంఏ తెలియజేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

M Espitha Chowdary

Admin

మరిన్ని వార్తలు

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.