Saturday, 11 April 2026 05:57:47 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం


Date : 30 June 2025 01:54 PM Views : 798

గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని, కార్యాచరణపై ప్రతి జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సూచనలు తీసుకున్నామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నామని, 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే తాను పర్యటించానని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా అందరితో స్వయంగా మాట్లాడానని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకుంటే... చంద్రబాబు కూటమిలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రం కోసం మోదీని నిలదీస్తోందని అన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నారంటే అందుకు చంద్రబాబే కారణమని, అయినా రాష్ట్రం కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు.

M Espitha Chowdary

Admin

మరిన్ని వార్తలు

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.