Saturday, 11 April 2026 04:24:23 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు..

అమ్మవారికి తొలి సారె సమర్పించిన ఈవో


Date : 26 June 2025 11:53 AM Views : 671

గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ, తమ చేతుల మీదుగా అమ్మవారికి తొలి సారె సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు సారె సమర్పణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నెల 29న అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జులై 8, 9, 10 తేదీలలో శాఖాంబరి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

M Espitha Chowdary

Admin

మరిన్ని వార్తలు

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.