ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్

M Espitha Chowdary | 27 June 2025 11:40 PM | ఆంధ్రప్రదేశ్
గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, దేశంలో ఆయనతో పోల్చదగిన ప్రజాహిత నాయకుడు మరొకరు లేరని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ కొనియాడారు. విజయవాడలో జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, చంద్రబాబు నాయకత్వ పటిమపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు ప్రజల కోసం దేవుడు పంపిన వరంగా చంద్రబాబును అభివర్ణించారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులకు వేదికగా నిలిచింది.
← Back Share Download