టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం

M Espitha Chowdary | 29 June 2025 03:22 PM | ఆంధ్రప్రదేశ్
గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వైకుంఠపాళీ అభివృద్ధి వద్దని.. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సుస్థిరపాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, యూపీ కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వంగా ఉందని.. ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటు తనం ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అందుకే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు.
← Back Share Download