గాయత్రి వార్తలు - ఆధ్యాత్మికం / తిరుపతి :
హిందూ పండుగలలో గురు పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున శిష్యులు తమ గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగను వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవి, వేద వ్యాసుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది జూలై 10న గురు పౌర్ణమి జరుపుకోనున్నారు.