గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి :
ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికరంగం తిరోగమనంలో ఉందని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక, గతంలో వైయస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీయిజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని ధ్వజమెత్తారు.